corona cases in india: దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే కాస్త తక్కువగానే కేసులు సంఖ్య నమోదు అవుతోంది. రెండు వారాల క్రితం వరకు దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో డైలీ కేసులు 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతున్నాయి. కోవిడ్ రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 10,725 మంది కరోనా బారిపడ్డారు. నిన్న ఒక్క రోజులోనే 13,084 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే కరోనా వల్ల మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 94,047 ఉంది. రికవరీ రేటు 98.60 శాతంగా ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.21 గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,43,78,920 నమోదు కాగా.. 4,37,57,385 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5,27,488 చేరింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా భారత్ లో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో అర్హులైన వారికి 210,82,34,347 కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 3,50,665 మంది వ్యాక్సినేషన్ ఇచ్చారు. 3,92,837 మందికి కరోనా టెస్టులు చేశారు.
Read Also: Karnataka Road Accident: కర్నాటక లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దేశాల్లో గత కొన్ని రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం జపాన్ లో 1.94 లక్షల కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. దక్షిణ కొరియాలో 1.39 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,31,85,878 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 64,79,892 మంది కోలుకున్నారు. అమెరికా, తైవాన్, జర్మనీల్లోనూ కేసుల సంఖ్య పెరిగింది.