Harish Rao: త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాత్‌ల్యాబ్స్, 5 ఎంఆర్ఐ, 30 సిటీ స్కాన్‌లు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. వీటితో పాటు 1020 అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఇవి పాడైన సందర్భంలో రిపేర్ కోసం 8888526666 కాల్ సెంటర్ ఏర్పాటు వేశామని మంత్రి వెల్లడించారు. కొన్ని గంటల్లో పరికరాలను రిపేర్ చేయడం… ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.
కరోనా కేసులు అక్కడక్కడ వస్తున్నాయన్న మంత్రి హరీష్.. బూస్టర్ డోస్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ సరఫరాలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందని ఆయన మండిపడ్డారు. 100 శాతం బూస్టర్ డోస్ పూర్తి అయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. 1,50 ,000 మంది గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లు ఇస్తామని మంత్రి తెలిపారు.
Also Read
Srinivas Goud: నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. రాజీనామా చేయడానికి రెడీ
మరోవైపు అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మనం చనిపోయినా అవయవదానం ద్వారా ఇతరుల రూపంలో జీవించే ఉంటామని చెప్పారు. అందువల్ల అవయవదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతూ ట్వీట్ చేశారు. ‘అవయవాలను దానం చేయడం వల్ల మరొకరికి బతకడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ప్రజలు అవయవాలను దానం చేడానికి తమ పేర్లను నమోదుచేసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
Donating organs give someone an another chance to live life.
On the eve of #WorldOrganDonationDay, I request people to register for organ donationRegister https://t.co/iZseKdzjFS pic.twitter.com/WKHNTVUahg
— Harish Rao Thanneeru (@BRSHarish) August 13, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!