Covid Vaccination: ‘4 కోట్ల మంది ఒక్క డోస్ కూడా తీసుకోలేదు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Vaccination: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణి విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98శాతం మంది కనీసం ఒక డోస్‌ని పొందారని.. జులై 18 వరకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొత్తం 1,78,38,52,566 వ్యాక్సిన్ డోసులు (97.34 శాతం) ఉచితంగా అందించినట్లు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు ఎంతమంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదో చెప్పాలని పలువురు సభ్యులు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి బూస్టర్ డోసు పంపిణీని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ క్రమంలో 18 నుంచి 59ఏళ్ల వారికి జులై 15 నుంచి ఉచితంగానే పంపిణీ మొదలు పెట్టామన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ విస్తృత పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజులపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98 శాతం మంది కొవిడ్-19 వ్యాక్సిన్‌లో కనీసం ఒక డోస్‌ను పొందగా.. 90 శాతం మంది పూర్తిగా రెండు డోసులను తీసుకున్నారు.
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Governor Tamilisai: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్
కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సుమారు 10-20 శాతం మంది దీర్ఘకాలం పాటు వ్యాధి లక్షణాలు వేధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వివరించారు. అందులో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, నిద్ర సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి, నరాలు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, ఆందోళన, జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేశామన్నారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!