Kishan Reddy: జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘ఆజాదికా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో ‘మోదీ@2.0’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో 12 కోట్ల కుంభకోణాలు జరిగాయన్న ఆయన.. మోదీ నాయకత్వంలో ఒక్క అవినీతి మరక లేదన్నారు. మోదీ మాకు పని విషయంలో నరకం చూపిస్తారని తెలిపారు. గతంలో రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారని అందరికి తెలుసన్నారు. 8 సంవత్సరాలుగా మోదీ ఒక్క సెలవు లేకుండా పని చేస్తున్నారని వెల్లడించారు. ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ అని.. 20 రోజులు ఫామ్ హౌస్.. 10 రోజులు ఇంట్లో ఉంటారని ఎద్దేవా చేశారు. మోదీ పుట్టినరోజు సైనికులతో చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు.
జీ-20 సమావేశాల్లో గత ప్రభుత్వ ప్రధాని ఎక్కడో కని కనిపించని స్థానంలో కూర్చునేవారని.. కానీ మోదీ స్థానం ఎక్కడో అందరికీ తెలుసన్నారు. భారతీయులు అనేక దేశాల్లో తలెత్తుకుని తిరుగుతున్నారని గర్వంగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే జరుగుతుందన్నారు. అమెరికా కూడా మన కరోనా వ్యాక్సిన్ కావాలంటోందని పేర్కొన్నారు. ఇప్పటికే 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించామన్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి తెలుగు విద్యార్థులను భారత్‌కు తీసుకొచ్చామన్నారు.
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?
రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి దేశ సత్తాను చాటామన్నారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి, అంబేడ్కర్ రాజ్యం తీసుకొచ్చామన్నారు. తమ పార్టీ పుట్టిందే జమ్ముకశ్మీర్ కోసమన్నారు. బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీ అంటారు.. కానీ యూపీలో 80 శాతం మంది ముస్లింలు వున్న ప్రాంతంలో కూడా గెలిచామన్నారు. ఆగస్ట్ 15న ప్రజలంతా ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.