Corona Cases In India: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 9,436 కేసులు నమోదు అయ్యాయి. శనివారం నమోదైన కేసుల కన్నా 820 కేసులు తగ్గాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 86,591కు చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.19గా ఉంది.
Read Also: Rahul Dravid: టీమిండియాకు గుడ్ న్యూస్.. ద్రవిడ్‌కు కరోనా నెగెటివ్
దేశంలో గడిచిన 24 గంటల్లో 30 మరణాలు సంభవించాయి. ఇందులో 27 మరణాలు కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,44,08,132 కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,27,754 గా ఉంది. అయితే వ్యాధి బారి నుంచి రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశంలో సగటు కోవిడ్ రికవరీ రేటు 98.62 శాతంగా ఉంది. ఇండియాలో 4.3 కోట్ల మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.93గా… వీక్లీ పాజిటివిటీ రేటు 2.70 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోె కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. జపాన్ లో కొత్తగా 196,628 కేసులు నమోదు కాగా.. 126 మంది మరణించారు. దక్షిణ కొరియాలో 95,538 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,53,28,762 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 64,86,863 మంది మరణించారు.