Corona Cases In India: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక నెల క్రితం వరకు సగటున 15 వేలకు పైగా నమోదుతూ వచ్చిన రోజూవారీ కరోనా కేసులు ప్రస్తుతం 5 వేల దిగువన నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 4,043 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 4,676 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో డైలీ పాజిటివిటీ రేటు 1.37 శాతానికి పడిపోయింది. వీక్టీ పాజిటివిటీ రేటు 1.81 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా బారినపడి మరణించారు. ఇందులో కేరళలోనే ఆరుగురు మరణించారు. హర్యానా, మహారాష్ట్రల్లో నలుగురు మరణించారు.
Read Also: Munugode Bypoll Update Live : మునుగోడు ఓటర్లకు బంగారమే.. బంగారం.!
రికవరీ రేటు 98.71గా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 47,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా ఇండియాలో ఇప్పటి వరకు 4,45,43,089 కరోనా కేసులు నమోదు అవ్వగా.. 5,28,370 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 4,39,67,340 మరణించారు. దేశంలో అర్హులైన వారికి 216,83,24,537 డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. నిన్న ఒక్కరోజే 13,10,410 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చారు. 2,95,894 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 3,10,515 నమోదు అయ్యాయి. 860 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 61,75,25,803కు చేరుకోగా.. ఇందులో 59,72,59,920 కోలుకోగా.. 65,31,867 మంది మరణించారు. జపాన్, దక్షిణ కొరియాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గింది. గతంలో లక్షకు పైగా నమోదు అయిన కేసులు.. ఇప్పుడు 50 వేలకు చేరాయి.