Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్-గుండెపోటు మరణాలకు సంబంధం లేదు.. ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన తర్వాత, ఫ్యామిలీ హిస్టరీలో సడన్ డెత్స్, కొన్ని జీవనశైలి కారణాలు వివరించలేదని ఆకస్మిక మరళణాల సంభావ్యతను పెంచాయని చెప్పారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్, గుండెపోటులకు మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన తర్వాత కొంతమందిలో ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి మరణాలకు కారణాలను నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. భారతదేశంలో యువకుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ఆకస్మిక మరణాలను పెంచలేదని చెప్పారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
Read Also: Raja Singh: అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్ గా నియమిస్తే.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను
కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండె సంబంధ మరణాలపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 18-45 ఏళ్లలోపు యువతతో ఆకస్మిక మరణాలపై, మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 47 మెడికల్ కేంద్రాలలో మల్టీ సెంట్రిక్ కేస్ కంట్రోల్ అధ్యయనం చేసింది. అధ్యయనంలో వారి జీవనశైలి, మద్యం, ధూమపాన అలవాట్లు, కుటుంబ చరిత్ర, మాదకద్రవ్యాల వినియోగం, మరణాలకు రెండు రోజుల ముందు శారీరక శ్రమకు సంబంధించిన పలు అంశాలను కూడా అధ్యయనం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ఇన్‌ఫెక్షన్, కోవిడ్ తర్వాత పరిస్థితులు ఇలా అన్నింటిని ఐసీఎంఆర్ పరిశీలించింది. ఈ అధ్యయనంలో 729 కేసులు, 2916 కంట్రోల్స్‌ని విశ్లేషించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా కూడా ఇలాంటి మరణాలు తగ్గాయని అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణాల వల్ల మరణాలు ముడిపడి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!