Booster Dose: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ చైనాను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వ్యాక్సిన్‌కు డిమాండ్ ఏర్పడింది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలో 23.8 శాతం మంది బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ జాబితాలో 47.6 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ విషయం స్వయంగా మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 46.3 శాతంతో రెండో స్థానంలో నిలవడం విశేషం.
Read Also: Afghanistan: మహిళా ఉద్యోగులపై నిషేధం.. తాలిబాన్ పాలకుల తాజా ఆదేశాలు
దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ తీసుకున్న రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ (41.7 శాతం) మూడో స్థానంలో, ఒడిశా (40.6 శాతం) నాలుగో స్థానంలో, గుజరాత్ (36.9 శాతం) ఐదో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ (38.3 శాతం) ఆరో స్థానంలో, ఉత్తరప్రదేశ్ (30.4 శాతం) ఏడో స్థానంలో, ఉత్తరాఖండ్ (27.4 శాతం) 8వ స్థానంలో, మధ్యప్రదేశ్ (24.8 శాతం) 9వ స్థానంలో, ఢిల్లీ (22.3 శాతం) పదో స్థానంలో ఉన్నాయి.
కాగా బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉందన్నారు. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవడం అవసరమని.. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. త్వరలో అవసరమైనన్ని డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం సంతోషం. సీఎం కేసీఆర్ గారి ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉంది. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుంది 1/2 pic.twitter.com/kTv9OIoCdV
— Harish Rao Thanneeru (@trsharish) December 24, 2022