DH Srinivasa Rao : ఫోర్త్ వేవ్ పై కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చైనాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి మార్పు లేదని, 20 నుంచి 25 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో మాత్రమే 10 నుంచి 15 కేసులు నమోదు అవుతున్నాయని, ఫోర్త్ వేవ్ పై అనేక సందేహాలు ఉండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయన్నారు.
థార్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, వేసవికాలంలో వేలాది శుభకార్యాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరమన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ మాస్క్, సానిటైజేషన్ ఉపయోగించాలని, వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని ఆయన సూచించారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 100 శాతం తీసుకున్నారని, 60 సంవత్సరాల పైబడిన వారు బుస్టార్ డోస్ తీసుకోవాలన్నారు. తెలంగాణలో ఆర్ వ్యాల్యూ .5శాతమే ఉందని, కానీ మాస్క్ ధరించాలన్నారు. ఫోర్త్ వేవ్ తెలంగాణలోరాదు. సిరో సర్వే ప్రకారం జనవరి 4వ తేదీన నిర్వహించారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
14,179 మంది యాంటీ బాడీస్ పరీక్ష చేశారు. సాధారణ ప్రజల్లో 92.9 శాతం ఉన్నాయి. హెల్త్ కేర్ వర్కర్క్స్ 93శాతం పాజిటివిటి ఉంది. భద్రాద్రిలో 89.2 యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయన్నారు. హైదరాబాద్ 97 శాతం ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయని, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లలో 98 శాతం, తీసుకోని వాళ్లలో 77 శాతం యాంటీ బాడీస్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని, మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!