శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. శివరాత్రి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 22 నుండి వచ్చే మార్చి 4 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కోవిడ్ నిబంధనలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలన్నారు హరిజవహర్ లాల్. ప్రతి భక్తుడు మాస్క్ దరించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలన్నారు హరిజవహర్ లాల్. జిల్లా అధికారుల సహకారంతో నడకదారి వచ్చే భక్తులకు మార్గ మధ్యలో ఆహారం,నీరు,వైద్యం ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే 50 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు కమిషనర్ హరిజవహర్ లాల్. కోవిడ్ నిబంధనల విషయంలో అజాగ్రత్త వద్దన్నారు. భక్తుల భద్రతే అధికారుల బాధ్యత అన్నారు. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం వుండడంతో పలు సూచనలు చేశారు.