కొండపై సామాన్యులకేనా రూల్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా?
ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు తిరుమల వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని.. ఆ సమయంలో కలిగే దివ్యానిభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. కానీ.. ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే TTDనే అంచెలంచెలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60-70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
కరోనా ఆంక్షలు సామాన్య భక్తులకేనా?
కోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు కూడా ఒకవైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తూతం 30-40 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూన్నా.. అవన్నీ ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నవే. సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నా.. సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంపన్నులుతో పోటి పడి దర్శనం టికెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్‌లైన్‌లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్ అడ్డొస్తోంది. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా.. వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వీఐపీ బ్రేక్ దర్శనాలపై నియంత్రణ లేదు
తిరుమలలో రోజూ సిఫారసు లేఖలపై VIP బ్రేక్ దర్శనాలను… ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. ఆ టికెట్ల సంఖ్య తగ్గించలేదు. పైపెచ్చు వాటి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నా.. గతంతో పోల్చితే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకి 18-20 వేల టికెట్లు జారీ చేయగా..ప్రస్తుతం 20-25 వేల వరకూ ఉంటోంది. వర్చువల్ సేవా టికెట్లు, సుపథం టికెట్లు.. ఇలా ఎక్కడా ఆ వర్గాలకు కోత లేదు. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యని TTD పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకి 30-50 వేలమంది సామన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు పదివేలే. అదీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది TTD.
వీఐపీ టికెట్ల కోసం గుమిగూడితే కోవిడ్ వ్యాప్తి చెందదా?
సామాన్య భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే.. వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని TTD హడలిపోతోంది. అయితే VIP టికెట్ల కోసం MBC వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో TTDనే చెప్పాలి. వైకుంఠ ఏకాదశి రోజున VVIPల పేరుతో జరిగిన హడావిడి కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లిన సమయంలో కానీ.. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యమనే మాటను మాటలకే పరిమితం చేసి.. పెద్దలను ఒకలా.. సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!