ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లో మరోసారి విజృంభిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో.. వివిధ వేరియంట్లుగా ప్రజలపై దాడి చేసిన మహమ్మారి.. మరోసారి పంజా విసిరుతోంది.. గత కొంతకాలంగా వెలుగు చూస్తోన్న రోజువారి పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మళ్లీ టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు పరుగులు పెడుతోంది కరోనా రోజువారి కేసుల సంఖ్య..…
రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్‌గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది. శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.…
భారత్ తో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ఇండియాలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దాదాపుగా 3 నెలల తరువాత గరిష్ట స్థాయికి కేసుల సంఖ్య చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో గురువారం కొత్తగగా 622…
ఇండియాలో కరోనా తీవ్రత కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా బీఏ4, బీఏ5 వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు తాజాగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజూవారీ కరోనా కేసులను వెల్లడించింది. కేసుల సంఖ్య 3 వేల కన్నా తక్కువగానే ఉన్నా.. గత నాలుగైదు రోజుల నుంచి నెమ్మదిగా కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన…
చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపుగా ప్రపంచంలో అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పట్లో ఈ మహమ్మారి ప్రపంచాన్నివదిలేలా కనిపించడం లేదు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొన్ని నెలులుగా కేసుల సంఖ్య రెండు మూడు వేలకు దిగువనే ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కేవలం 1675 కేసులు…
ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. ప్రపంచంలో ఏం జరుగుతుందో నార్త్ కొరియా ప్రజలకు… నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం చాలా తక్కువ. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వింతవింత రూల్స్, చిత్ర విచిత్రంగా ఉండే దేశం ఉత్తర కొరియా. ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి దేశాన్ని కరోనా భయపెడుతోంది. కిమ్ రాజ్యంలో కోవిడ్ -19 తీవ్రంగా విజృంభిస్తోంది. ఎంతలా అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ…
కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచదేశాలను చుట్టేసి కోవిడ్.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. ఇలా విరుచుకుపడుతూనే ఉంది.. అయితే, ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తుండడంతో.. కట్టడికోసం సుదీర్ఘ లాక్‌డౌన్‌లు విధిస్తోంది చైనా సర్కార్.. దీంతో, ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇదే…
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. చాలా దేశాలను చుట్టేసింది.. అయితే, ఉత్తర కొరియాకు సంబంధించిన ఎలాంటి సమాచారం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. కానీ, అక్కడ కరోనా తీవ్రంగా ఉందని.. లాక్‌డౌన్‌లతో నానా కష్టాలు పడుతున్నారని.. తినడానికి తిండి కూడా లేదంటూ.. రకరకాల కథనాలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు వెలుగు చూసింది.. కరోనా వ్యాప్తి మొదలైన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టింది మహమ్మారి.. తాజాగా, ప్యాంగ్యాంగ్‌లో పలువురికి…
చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల…