ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇండోర్ / అవుట్‌డోర్ సమావేశాలు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
PM Narendra Modi Comments in NITI Aayog Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020 మార్చి కరోనా లాక్ డౌన్ తర్వత తొలిసారిగా ముఖాముఖీ సమావేశం జరిగింది. అంతకు ముందు కేవలం వర్చువల్ సమావేశాలే జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,551 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 70 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 21,591 మంది కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 17,135 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 47 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 19,823 మంది కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో16,464 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు భారీగా తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 39 మంది కరోనా బారినపడి చనిపోయారు.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ (94)ఆదివారం మధ్యాహ్నం కొవిడ్ సమస్యల కారణంగా మరణించారు. కరోనా సమస్యల కారణంగా ఆయన మకాటి మెడికల్ సెంటర్‌లో మృతి చెందారని మనీలా టైమ్స్ నివేదించింది.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.