చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపుగా ప్రపంచంలో అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పట్లో ఈ మహమ్మారి ప్రపంచాన్నివదిలేలా కనిపించడం లేదు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొన్ని నెలులుగా కేసుల సంఖ్య రెండు మూడు వేలకు దిగువనే ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కేవలం 1675 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ… 31 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,841గా ఉంది. ఒక్క రోజులోనే 1635 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం డైలీ పాజిటివ్ రేటు 0.41 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తంగా 4,31,09,248 మంది కరోనా బారిన పడ్డారు. 4,26,00,737 కోలుకోగా… 5,24,490 మంది మహమ్మారి వల్ల మరణించారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ వల్లే మూడో వేవ్ వచ్చినా.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయినా… చాలా వరకు మరణాలు అడ్డుకోగలిగాం. దేశంలో సోమవారం నాటికి 192,52,70,955 డోసుల టీకాలు ఇచ్చారు. సోమవారం ఒక్క రోజే 13,76,878 మందికి టీకాలు ఇచ్చారు.