ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. చాలా దేశాలను చుట్టేసింది.. అయితే, ఉత్తర కొరియాకు సంబంధించిన ఎలాంటి సమాచారం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. కానీ, అక్కడ కరోనా తీవ్రంగా ఉందని.. లాక్‌డౌన్‌లతో నానా కష్టాలు పడుతున్నారని.. తినడానికి తిండి కూడా లేదంటూ.. రకరకాల కథనాలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు వెలుగు చూసింది.. కరోనా వ్యాప్తి మొదలైన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టింది మహమ్మారి.. తాజాగా, ప్యాంగ్యాంగ్‌లో పలువురికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒమిక్రాన్వేరియంట్సోకినట్టు తేలిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
Read Also: Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల
దీంతో, అప్రమత్తమైన ఉత్తర కొరియా చీఫ్ కిమ్.. అధికార కొరియన్వర్కర్స్పార్టీ పొలిట్బ్యూరో సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించారు.. వైరస్కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. వైరస్వ్యాప్తిని అరికట్టడం, వ్యాప్తిచెందకుండా ఉండేందుకు దానిని మూలాల్ని వీలైనంత త్వరగా రూపుమాపాలని ఆదేశించారు కిమ్.. కాగా, ఉత్తర కొరియాకు పొరుగునే ఉన్న చైనాలో కరోనా మహమ్మారి వెలుగు చూసిన వెంటనే సరిహద్దులు మూసివేసి కట్టడి చర్యలు చేపట్టారు ఆ దేశాధినేత కిమ్జోంగ్ఉన్… దీంతో, ఇప్పటి వరకు మహమ్మారి ఆ దేశంలో అడుగుపెట్టలేదు.. కానీ, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ఎంట్రీ ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ఆదేశాలు జారీ చేశారు కిమ్.