ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది.. థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపడుతున్నాయి.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు.. ఇది, పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.. సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. చివరిసారిగా 2019 ‘అర్జున్ సురవరం’లో కన్పించిన నిఖిల్ ఖాతాలో ఇప్పుడు రెండు సినిమాలు ‘కార్తికేయ 2′, ’18 పేజీలు’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ హీరో మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. అయితే మహమ్మారి కారణంగా నిఖిల్ సినిమాల విడుదల తేదీలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు…
రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల జాబితాలో సెలెబ్రిటీలు వరుసగా చేరిపోతున్నారు. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి రెండవసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, తాజాగా మరో యంగ్ హీరో కోవిడ్ పాజిటివ్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇటీవలే ‘అఖండ’లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు. Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్ ఈ విషయాన్ని శ్రీకాంత్…
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్య ప్రజలతో పాటు ఈసారి చాలామంది సెలెబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని, స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు…
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్‌లో కోవిడ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కేసులు మళ్లీ భారీ సంఖ్యలో పెరుగుతూ పోతున్నాయి.. ఇదే సమమంలో.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు మహమ్మారి.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కోవిడ్ సోకుతుంది.. మరికొందరు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కోవిడ్ బారినపడుతున్నారు.. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులను కోవిడ్ పలకరించింది.. కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతులు చాలా…
కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు?…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.. తనకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది.. స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వైద్యుల సూచనల…
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…