కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
శవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు 21,880 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 67 మంది కరోనా బారినపడి చనిపోయారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని అధికారులకు మంత్రి హరీశ్ రావ్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో DMHOలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని వైద్య సిబ్బందికి పలు సచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ దేశంలో వేగం పుంజుకుంటోందని ,పోర్త్ వేవ్ కు చేరువలో వున్నామా అన్నట్లు భయాన్ని…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు 20,557 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,566 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం ఉదయం వరకు 15,528 కేసులు మాత్రమే నమోదు కాగా ఇవాళ భారీగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 16,935 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం తెలిపింది.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.. ‘కుంబళంగి నైట్స్’ సినిమాతో మంచి పేరుపొందిన మలయాళ నటి అంబికారావు (58) గుండెపోటుతో మరణించారు… అంబికారావు సోమవారం రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం, ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10.30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వచ్చిన సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. ఆమె మృతిచెందినట్టు తెలుస్తోంది.. మలయాళ చిత్ర పరిశ్రమలో 2002లో అడుగుపెట్టారు అంబికారావు.. చలనచిత్ర నిర్మాత…