Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో శివసేన పార్టీ ఉన్నట్టు స్పష్టం అవుతోంది.. విధాన సభను రద్దు చేయొచ్చంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం ఆస్తికరంగా మారాయి.. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా రాజకీయాల్లో హీట్ పెరగగా.. శివసేకు ఉన్న మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే వెంటే 34మంది ఎమ్మెల్యేలు వెళ్లడంతో.. ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంతో సీఎం ఉద్ధవ్ థాక్రే వైపు మిగిలింది కేవలం 21 మందే కావడంతో.. ఎప్పుడైనా సర్కార్ కూలిపోవచ్చు అంటున్నారు.
Read Also: Green India Challenge: కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చర్చగా మారింది.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కూడా కరోనా సోకింది.. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఐసోలేషన్‌కే పరిమితం కావడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.. ఇక, గవర్నర్ కూడా కరోనా బారినపడడంతో.. గోవా గవర్నర్‌కు మహారాష్ట్ర ఇంఛార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు.. ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థంకానీ పరిస్థితి ఉంది.. శివసేన, ఉద్ధవ్ థాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా, సంప్రదింపులు జరిపినా ఏక్‌నాథ్ షిండే దిగిరాకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. అయితే, భారతీయ జనతా పార్టీతో కలిసేప్రసక్తే లేదని ఇప్పటికే థాక్రే స్పష్టం చేశారు.. రాజీకంటే.. అసెంబ్లీని రద్దు చేయడమే బెటర్ అని వ్యాఖ్యానించారు. దీంతో, ప్రభుత్వాన్ని రద్దుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..