Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
COVID-19 Alert: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది. గత కొన్ని రోజులుగా యూఎస్ లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది.
Corona Virus: కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం అంతంత మాత్రంగా ఉన్న కేసులు ఈ వారంలో అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే మరణాలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 2000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 కు పైగా పెరిగింది. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం కరోనా కేసుల సంఖ్య 3,000 మార్కును దాటి 3,395 కు పెరిగింది. రెండేళ్ల తర్వాత భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000 దాటడం బహుశా…
దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పంజాబ్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. చండీగఢ్ రాజధాని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి (GMCH)లో ఈ రోజు ఉదయం 35 ఏళ్ల రోగి మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో లూథియానాలోని సమ్రాలా నుంచి చండీగఢ్‌కు రిఫర్ చేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. రోగికి ఇప్పటికే కాలేయంలో గడ్డ ఉందని, ఇతర వ్యాధులతో (కొమొర్బిడ్ పరిస్థితులు) బాధపడ్డాడు. ఒకటి కంటే ఎక్కువ రోగాలు…
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య…