విశాఖ అరకులోయలో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఆర్డీవో లక్ష్మిశివజ్యోతి. అయితే కోవిడ్ బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించిన ఎమ్మెల్యే అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం అరకు ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్ ను పరిశీలించారు. అయితే ఏపీలో కామరోనా కేసులు రోజు భారీ స్థాయిలో నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్ర…
గోవాలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత కారణంగా తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మొత్తం 83 మంది మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో అధికారులు ఈ ఆసుపత్రిపై దృష్టి సారించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా…
కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది. పూణే జిల్లాలోని బారామతిలోని ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే,…
కరోనాను కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, వ్యాక్సిన్ల కొరత భారత్‌ను వెంటాడుతూనే ఉంది… పేరు మాత్రం ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం అయినా.. వ్యాక్సిన్ల కొరతతో అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చిందిలేదు.. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా.. రానున్న 2 నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్…
కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. భారత్‌లో కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని.. ఆస్పత్రులపాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని.. కోవిడ్ బారినపడి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే…
కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారినపడగా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.. ఇక, గన్నవరం విమానాశ్రయం లో…
కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు. గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక వేడినీళ్లు తాగడం వలన శరీరంలో అవయవాలు యాక్టివ్ అవుతాయని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాల నొప్పులు తగ్గుతాయని, మెదడకు రక్తసరఫరా జరుగుతుందని నిపుణులు…
తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం భక్తులు సంఖ్య 5 వేలు కూడా దాటడం లేదు. నిన్నటి రోజున స్వామివారిని అత్యల్పంగా 2262 మంది భక్తులుదర్శించుకున్నారు. మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు పడిపోయింది లడ్డు ప్రసాదం విక్రయాలు. లక్షమందికి పైగా అన్నప్రసాద…
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. ఇందులో 1,93,82,642 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,099 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4205 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం…