విశాఖ అరకులోయలో 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పాడేరు ఆర్డీవో లక్ష్మిశివజ్యోతి. అయితే కోవిడ్ బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించిన ఎమ్మెల్యే అన్ని చోట్లా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం అరకు ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్ ను పరిశీలించారు. అయితే ఏపీలో కామరోనా కేసులు రోజు భారీ స్థాయిలో నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలకు పైగా కేసులు వందకు పైగా మరణాలు నమోదయ్యాయి.