తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722 కి చేరింది. ఇందులో 3,89,491 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 77,704 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 51 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బి.1.617, బి.1.618 తో పాటుగా ఎన్ 440 కె రకం వేరియంట్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిపై చేసిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. మొదటి దశలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా, రెండో దశలో ఒకటి నుంచి ఏకంగా ముగ్గురికి వ్యాపిస్తున్నట్టు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్…
ఐపీఎల్ 2021 సీజన్ కు కరోనా సెగ తాకిన విషయం తెలిసిందే. ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారట. ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. బయో బబుల్ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తాయి పోతాయి… తెలంగాణ లో పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, వెంటి లెటర్ లు లేవని అనేక పోన్స్ వస్తున్నాయి బంగారు తెలంగాణ శవాల తెలంగాణ గా మారింది. గుట్టలు గుట్టలు గా శవాలు ఉన్నాయి. బాధ,భయం తో యువకులు చనిపోతున్నారు. కోవిడ్ నియంత్రణకి ఏ జిల్లాకు నిధులు కేటాయించలేదు. పేదలు చనిపోతున్న…
ఈ ఏడాది సరిగ్గా సగం ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. ఇక తాజా సమాచారం ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ…
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో ఈరోజు ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అయితే బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు తెలుస్తుంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు… అక్కడే అతనికి వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉండగా.. సెకవండ్ వేవ్‌లో అత్యధికంగా ఇవాళ ఏకంగా 19 వేల పైచీలుకు కేసులు నమోదు అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. గతో 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 61 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు చేరుకోగా.. మృతుల…
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.. ఇప్పటికే రెండో విడతలగా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.. దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మరోవారం…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్‌లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు…