కరోనా కాలంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలో కేసులు మరింత భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇక మహారాష్ట్రలో కేసుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ కారణంగా ఆ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడింది. పూణే జిల్లాలోని బారామతిలోని ముదాలే గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ అనే బామ్మకు జ్వరం రావడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో బామ్మను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే, పరిస్థితి విషమించడంతో బారామతిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బెడ్ దొరక్కపోవడంతో చాలా సేపు వాహనంలోనే ఎదురు చూశారు. వాహనంలోనే బామ్మ స్పృహతప్పి పడిపోయింది. చనిపోయిందని భావించిన బామ్మను ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సడెన్ గా పాడే మీదనుంచి లేచి కూర్చున్నది. దీంతో షాకైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.