ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 106కు పెరిగింది.. ఇదే సమయంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా…
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే నమోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసి తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 71,070 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 25 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించారు అనో అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేషంట్ల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. జిల్లాలో 39 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వేసిన కోటి 54 లక్షల రూపాయల పెనాల్టీని…
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గాంధీకి వెళుతున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఉంచారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని తెలిపారు. అలాగే వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. జూడాలతో…
కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల…
ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,67,334 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330 కి చేరింది. ఇందులో 2,19,86,363 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 32,26,719 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,529 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,83,248కి చేరింది. ఇక 24…
గత యేడాది కంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో వేలాది మంది థియేటర్ల యాజమాన్యం సొంత నిర్ణయంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. విడుదల అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత పడే ఛాయలు కనిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్రసీమ వసూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండగా, గత యేడాదిలో…
కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో మే 24 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటీకి కరోనా కేసులు కంట్రోల్ కావడంలేదు. రోజువారి కేసులు 38 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ను అమలు చేస్తే…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది. అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది. ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు…
తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని లక్షా ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 5,081 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,104 మంది భక్తులు. అయితే ఈ కరోనా కారణంగా శ్రీవారి ఆదాయం కూడా తగ్గిపోయింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షలు. అలాగే…