కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న అనంతరం 80శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. రెండో డోసులు తీసుకున్నాక 97 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఇంగ్లాండ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాక 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఆసుపత్రుల్లో…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహాద్దుల్లో అంబులెన్స్ ను అడ్డుకోవడంపై కూడా…
కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ గాలిలో ఎంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఎంత తీవ్రత ఉంటుంది అనే అంశాలపై అనేక మంది అనేక సమాధానాలు ఇచ్చారు. అయితే, అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మరోసారి దీనికి సమాధానం తెలిపింది. కరోనా రోగి నుంచి వైరస్ మూడు నుంచి ఆరు అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటుందని, గాలి వెలుతురు సరిగా లేని గదిలో ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వరకు…
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పాగా కేసులు వస్తున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే ఏపీలోని అన్ని జిల్లాల కంటే విశాఖలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కర్ఫ్యూ కారణంగా విశాఖలో బీచ్ రోడ్డు బోసిపోయింది. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ తో విశాఖలో వీకెండ్ జోష్ కనిపించలేదు. కరోనా భయంతో విశాఖ వాసులు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం…
ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది…
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3915 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సమయాన్ని కరోనా బాధితులకు సహాయం చేయడానికి కేటాయించారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కావలసిన అవసరాలను తీర్చడంతో పాటు వారు ఎక్కడ నుండి తమకు కావాల్సిన వాటిని తీసుకోవచ్చు అనేదాన్ని తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇదిలా…
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను పెద్దలందరికి అందించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 88 లక్షల టీకాలు ఉన్నాయిని, మరో మూడు రోజుల్లో 28 లక్షల టీకాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మే 1 వ తేదీ నుంచి దేశంలో…
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి. ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా ఏ మాత్రం కట్టడి కావడం లేదు. కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది. రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు…