బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించారు అనో అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేషంట్ల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. జిల్లాలో 39 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వేసిన కోటి 54 లక్షల రూపాయల పెనాల్టీని యాజమాన్యాలు చెల్లించారు అన్ని చెప్పారు. ఇంకా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మార్పు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.