కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో మే 24 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటీకి కరోనా కేసులు కంట్రోల్ కావడంలేదు. రోజువారి కేసులు 38 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ను అమలు చేస్తే మే నెలాఖరు వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.