తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే నమోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసి తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 71,070 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 25 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 46,946 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ఇక, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 594 కొత్త కేసులు వెలుగు చూడగా.. రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 239 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.