ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,67,334 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330 కి చేరింది. ఇందులో 2,19,86,363 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 32,26,719 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,529 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,83,248కి చేరింది. ఇక 24 గంటల్లో 3,89,851 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం.