కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఫస్ట్, సెకండ్ డోస్ వేయించుకున్న వారికి ఇప్పుడు బూస్టర్ డోస్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఫస్ట్, సెకండ్ డోస్‌లతో పోలిస్తే.. బూస్టర్ డోస్ కు స్పందన పెద్దగా లేదనే వాదన కూడా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం.. ఇంటి వద్దరే వెళ్లి బూస్టర్ డోస్ వేసేలా ప్లాన్ చేస్తోంది.. కోవిడ్ ఫస్ట్, సెకండ్ డోసుల పంపిణీలోనూ ఇలాంటి చర్యలే తీసుకుంది సర్కార్.. ఇంటి వద్దకు వెళ్లి.. పొలాల్లోకి వెళ్లికూడా వ్యాక్సినేషన్ వేశారు.. ఇవాళ సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్‌రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు..
Read Also:
Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జీలు..
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో అందరికీ బూస్టర్ డోస్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవలని.. అదే సమయంలో.. మహమ్మారిపై విజయం సాధించడానికి బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్‌రావు… పారిశుద్ధ్య నిర్వహణ, కోవిడ్ బూస్టర్ డోస్ విషయంలో అందరిలోనూ అవగాహన కల్పించాలన్నారు.. కాగా, ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారు.. బూస్టర్ డోస్‌ను వేసుకోవాలంటే.. మొదట్లో డబ్బులు వెచ్చించాల్సి ఉన్నా.. ఆ తర్వాత బూస్టర్‌ను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.