Booster Dose: నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా అంతానికి భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభం కానుంది. బుధవారం కేంద్రం ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జూలై 15 నుంచి 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ కాల్ సందర్భంగా దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది ప్రారంభం అయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విడతల వారీగా అర్హులైన వారందరికీ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 199 కోట్ల డోసుల టీకాలను అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ టీకాను ఇవ్వనున్నారు.
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
Read Also: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్‌లోనూ ముందంజ
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండో డోస్ వ్యాక్సినేషన్ కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ మధ్య కాలాన్ని తొమ్మిది నెలలు లేదా 39 వారాల నుంచి ఆరు నెలలు లేదా 26 వారాలకు కుదించారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దేశంలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఉచిత బూస్టర్ డోస్ అందుబాటులో ఉంది. కేంద్రం నిర్ణయంతో నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటి వరకు 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!