తెలంగాణలో క్రమంగా టెస్ట్‌ల సంఖ్య పెరుగుతూ ఉంటే.. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,29,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,813 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 1801మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8766 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773 కు చేరింది. ఇందులో 16,64,082 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,03,995 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 67 మంది…
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయను వేగ వంతం చేస్తున్నారు. అంతేకాదు, జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ఆందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమైంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కనీసం రెండు నెలలపాటు నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వేవ్‌లు రాకుండా ఉంటాయని, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం…
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్‌డౌన్ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్ కర్ఫ్యూను…
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. ఓవైపు టెస్టుల సంఖ్య పెంచినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతూ వస్తోంది… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,33,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1,897 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,982 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది..…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్..…
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ జరగడం లేదు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేపల్లి నియాజక వర్గంలోని పొదలకూరులో నేడు ఆనందయ్య మందు పంపిణి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాలెంటీర్ల ద్వారా మందు పంపిణీ జరుగుతుంది. పొదలకూరు మండలంలోని 30 పంచాయతీలకు రూట్ ఆఫిసర్ల ద్వార మందు తరలింపు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కృష్ణపట్నం లో కి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. ఆధార్ కార్డు…
రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు.…