రుయా ఆస్పత్రిలో నర్సులు ఆందోళన చేస్తున్నారు. నర్సుపై సూపరింటెండెంట్ విచారణ వేయడంపై ఈ నిరసన చేస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వినియోగంలో నర్సుపై ఆరోపణలు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసారు. ఆరోపణలపై విచారణ చేస్తున్నారు రుయా సూపరింటెండెంట్ భారతి. అయితే ఈ సూపరింటెండెంట్ వైఖరిని నిరసిస్తూ నర్సులు ఆందోళన చేపట్టారు. అయితే నర్సులపై వేధింపులు మానుకోవాలని సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందించారు.
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్న… కరోనా మంతనాలు మాత్రం తగ్గడం లేదు. దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155 కి చేరింది. ఇందులో 2,79,11,384 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,80,690 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,002 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,67,081…
తెలంగాణలో కరోనా పాజివిటీరేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1707 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 16 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా..…
కాకినాడ సాయిసుధా హాస్పిటల్ అధినేత, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వాడ్రేవు రవిపై క్రిమినల్ కేసు నమోదు చేసారు. కొవిడ్ కేసుకు అత్యధికంగా 14 లక్షల రూపాయలు ఫీజు వసూలు, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం, మృతుడు కుటుంబ సభ్యులను మోసగించారనే అభియోగాలపై బాధితులు ఫిర్యాదు చేసారు. క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ త్రీటౌన్ పోలీసులు. డాక్టర్ వాడ్రేవు రవిని పోలీసు స్టేషన్ లో విచారించారు త్రీటౌన్ సి.ఐ. రామకోటేశ్వరరావు. ఇక సాయిసుధా హాస్పిటల్…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823 కి చేరింది. ఇందులో 2,77,90,073 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,21,671 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,403 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,63,079 కి చేరింది. ఇక ఇదిలా…
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ బారినపడి మరో 14 మంది మృతి చెందారు. ఇక, 24 గంటల్లో 2,524 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 23,561 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది, రికవరీ…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో భారత్ వణికిపోయింది… మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి.. ఫస్ట్ వేవ్‌లో అనారోగ్యసమస్యలతో ఉన్నవారు ఇబ్బంది పడితే, సెకండ్ వేవ్‌లో యువతను కూడా వదలలేదు మహమ్మారి.. ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. అయితే, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని చెప్పలేమని.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లోనూ చాలా మంది చిన్నారులకు కోవిడ్ బారినపడ్డారని…
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, డీజీపీ, పౌరసరఫరాల శాఖ నివేదికపై వాదనలు జరిగాయి. హెల్త్ సెక్రటరీ రిజ్వీ కూడా హైకోర్టుకు హాజరయ్యారు. లాక్‌డౌన్ సడలింపుల గురించి వైద్యశాఖ కోర్టుకు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువ ఉన్నందున.. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపింది. థర్డ్‌వేవ్ చర్యలపైనా కేబినెట్ చర్చించిందని కోర్టుకు చెప్పింది వైద్యశాఖ. బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేషన్ సదుపాయాలపైనా చర్చించారని తెలిపింది. అయితే గతంలో ప్రైవేట్ ఆస్పత్రులకు జీవో ఇవ్వాలని చెప్పినా… ఎందుకు…