చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకే వ్యావిడిటీ లేదన్న రోజా… కెమెరాల ముందు చంద్రబాబు, లోకేష్‌కు భజన చేస్తారు.. కెమెరాల వెనుక పార్టీ లేదు.. తొక్కా లేదు అంటారు.. అంటూ ఆయన వ్యాఖ్యలను గుర్తుచేశారు.. ఇక, కరోనా సమయంలో.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. ఇతర అంశాలపై.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..