ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు.…
ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం “లాక్ డౌన్” పొడిగించింది ప్రభుత్వం. క్రమేపి “లాక్ డౌన్” సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత “కరోనా” విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం. మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ…
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు. అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదు. లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు.…
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ కోసం వనమూలికలను ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టు కు తరలిస్తున్నారు. అయితే సోమవారం నుంచి మందు పంపిణీ చేయనుండగా.. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. ఇక ప్రస్తుతం కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు…
లాక్‌డౌన్ చర్యలు క్రమంగా కరోనా కేసులు తగ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 3,821 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు…
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఆ పార్టి నేతలు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని గవర్నర్ కు వినతి పత్రం అందచేసిన సాకే శైలజానాథ్ అనంతరం మాట్లాడుతూ… దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మాటలు చెప్పకుండా ఏకీక్రుత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలి. భారత్ బయోటెక్ మంచి నీటి బాటిల్ కన్నా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కానీ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారు.…
సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో తాడిపత్రిలో యుద్ధప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మించారు. మరి కాసేపట్లో వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం చేసారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో ఆసుపత్రి నిర్మించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350 కి చేరింది. ఇందులో 2,65,97,655 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,35,993 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2713 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702 కి చేరింది. ఇక ఇదిలా…
తిరుమల శ్రీవారిని నిన్న 18839 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక మొత్తం 8840 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా… హుండి ఆదాయం 88 లక్షలుగా ఉంది. అయితే కరోనా కారణంగా శ్రీవారి హుండి ఆదాయం తగిపోతుంది. ఇక ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. ఆకాశగంగ వద్ద బాలాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసేలా ఏర్పాట్లు చేసింది. అలిపిరి నడకమార్గం జూలై 31వరకు మూసివేత, ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు…
కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తున్నారు ఆనందయ్య. ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ మందు పంపిణీ విషయంలో నాకు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి…