ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్!
పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై ఓడిన ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఇక ఎలిమినేటర్‌లో ముంబై ఆడాల్సి ఉంది.
లివర్‌పూల్ అభిమానులపైకి దూసుకెళ్లిన కారు.. 27 మందికి గాయాలు
ఆనంద సంబరాల వేళ ఒక్కసారిగా వాతావరణం భీతావాహంగా మారింది. ఓ వైపు సంబరాలు.. ఇంకోవైపు హాహాకారాలతో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ మారిపోయింది. ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించింది. లివర్‌పూల్ జట్టు, సిబ్బంది ప్రీమియర్ లీగ్ ట్రోఫీతో ఓపెన్-టాప్ బస్సులో సిటీ సెంటర్ గుండా అభివాదం చేసుకుంటూ వెళ్లింది. చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.
అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ..?
అక్కినేని అఖిల్ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్ డ్జీ కూతురు జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడపగా.. వాళ్ల ఎంగేజ్మెంట్ గత ఏడాది నవంబర్ 26న జరిగింది. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నాగచైతన్య రెండో పెళ్లి సమయంలోనే అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం అందరూ షాకయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎక్కువగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది. ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని.. డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతుండగా.అక్కినేని కుటుంబం నుంచి మాత్రం పెళ్లి పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ఇంటి సభ్యులు ఎవరు స్పందించడం లేదు.. తాజాగా వీళ్ల వివాహ తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. వెయ్యి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య!
ఏపీలో మహమ్మారి కరోనా వైరస్ కేసుల నమోదు కలకలం రేపుతోంది. తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లా ఏలూరుకు చెందిన భార్యభర్తలు, తెనాలికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు వృద్ధుడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ పరీక్షలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గుంటూరు జిల్లాలో మూడు కేసులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే విశాఖ, నంద్యాల జిల్లాలో మహిళలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఆ మూడింటిపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని
కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాశ్మీర్ సమస్యను, నీటి సమస్యను.. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి ప్రయోజనాల కోసం భారత్‌తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు.
ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్నే మార్చేసింది..
ప్రజంట్ టాలీవుడ్ లో మొత్తం కన్నడ భామల హవా నడుస్తోంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్‌చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్‌ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణీ వసంత్ చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి మరిన్ని తెలుగు చిత్రాల్లో అద్భుతమైన ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో అదృష్టం అనేది ఎవ్వరికి ఎలా ఏ రూపంలో వస్తుందో తెలియదు..
మరీ ఇంత దారుణమా.. డ్రైవర్‌ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!
రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. గుడియా గ్రామానికి చెందిన చరిత్రాపాతి తేజపాల్ సింగ్ ఉదావత్ అనే వ్యక్తి, తన సొంత డ్రైవర్‌ను జేసీబీకి తలకిందులుగా కట్టేసి, బెల్ట్‌తో దారుణంగా కొట్టాడు. ఈ హింసాత్మక ఘటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. డ్రైవర్ గాయపడిన తరువాత కూడా, అతని వదలకుండా గాయాలపై ఉప్పు రుద్ది తీవ్రంగా వేధించారు. ఈ ఘటన మూడు నెలల క్రిందట జరిగిందని, అయితే ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రసతుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
నేడు పహల్గామ్‌లో కేబినెట్ భేటీ.. దేనికోసమంటే..!
జమ్మూకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పదవీ కాలంలో సాధారణంగా వేసవి రాజధాని శ్రీనగర్ ఉంటుంది. ఇక శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రెండింటికి భిన్నంగా తొలిసారి పహల్గామ్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పర్యాటక రంగం కుదేలైంది. ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో బిజినెస్ పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మంగళవారం పహల్గామ్‌లో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసకుంది. ఈ భేటీ ద్వారా పర్యాటకులకు, స్థానికులకు ఒక సంఘీభావంగా ఉంటుందని భావిస్తోంది.
ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. ఒకేరోజు 77 మంది ఉద్యోగులకు మెమోలు
వరంగల్ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల అయిన ఎంజీఎం ఆసుపత్రిలో పెద్ద స్థాయిలో ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతుల్లేకుండా విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో మొత్తం 77 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ బాగా అధ్వానంగా ఉండటం అధికారులు గమనించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజాప్రతినిధులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.