దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కేసులు.. ఆ సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: North Korea: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రెడీ.. రష్యాకు మద్దతు ప్రకటించిన కిమ్
గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక గురువారం ఉదయం 8 గంటలకు 4,866కు కేసులు పెరిగినట్లుగా స్పష్టం చేసింది. ఢిల్లీ, కర్ణాటకలలో చెరో 2 మరణాలు సంభవించగా.. మహారాష్ట్రలో 3 మరణాలు సంభవించాయి. బుధవారం కేరళలో 114 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో వరుసగా 112, 106, 105 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు..
ఇక కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలోని ఆసుపత్రుల సంసిద్ధతను చేస్తుంది. ఆక్సిజన్ సరఫరా, అవసరమైన మందుల స్థితిగతులకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేయనున్నారు. దేశంలోని ప్రధాన ఆసుపత్రులలో వెంటిలేటర్ల లభ్యతను అంచనా వేయనున్నారు. దేశంలో కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు తలెత్తితే ఆసుపత్రుల సంసిద్ధత స్థాయిని ఈ డ్రిల్ అంచనా వేయనుంది.
అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. అలాగే చాలా మార్పులు చెందుతోందని.. కాకపోతే తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం, కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తెలిపింది.