Covid 19: నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, ఒకేసారి ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. పల్మనాలజీ విభాగంలో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది.. మహిళకు, పురుషులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు అధికారులు.. కేరళ నుంచి వచ్చిన నర్సింగ్ స్టూడెంట్ కి కరోనా లక్షణాలు ఉండడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు.. మళ్లీ కరోసా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు.. కాగా, దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వరుసగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి..
Read Also: PM Modi: నేడు జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని