చైనాతో పాటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి హడలెత్తించిన సంగతి తెలిసిందే.. చైనాలో ఈ మహమ్మారి కారణంగా లక్షలాది మంది చనిపోయారు. అదే సమయంలో.. అంటువ్యాధి కారణంగా సంభవించే మరణాల నుండి చైనా గుణపాఠం నేర్చుకుంది. ఈ క్రమంలో.. దేశంలో ఐసియు పడకల సంఖ్యను పెంచాలని చైనాకు చెందిన అనేక ఏజెన్సీలు సోమవారం తెలిపాయి. 2025 నాటికి దేశంలో 100,000 మందికి 15 ఐసీయూ పడకలు, 2027 నాటికి 18 ఉండాలని ఏజెన్సీలు తమ ప్రతిపాదనలో పేర్కొన్నాయి.
కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు.
Corona : మళ్లీ కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. ఈసారి మరో కొత్త వేరియంట్‌తో ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేస్తోంది. గత నెలలో అంటే డిసెంబర్‌లో కరోనా కారణంగా 10,000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది.
Corona : భారత్‌లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం మొదలైంది. 24 గంటల్లో దేశంలో మొత్తం 412 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 293 మంది రోగులు కోలుకున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించాం.. అన్ని హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వెరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని…
New Covid Variant JN.1: భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కేసులు 21 నమోదయ్యాయి. కోవిడ్ టెస్టులను ల్యాబుల్లో పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. అయితే, ఇప్పటికే మూడు వేవ్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Corona : కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సింగపూర్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
COVID-19: 2019 చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని మొత్తం వ్యాపించింది. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో లక్షల్లో మరణాలకు కారణమైంది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.