దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోగా.. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మృతుల సంఖ్య 3కి చేరింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 2, 700 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్ర నష్టం జరగడంతో వైద్య శాఖ అప్రమత్తమై.. జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Kamal: నాకన్నా నలుగురు బెస్ట్ యాక్టర్స్ దొరికినపుడు నటన ఆపేస్తా!
గత వారం నుంచి ఒక్కసారిగా అమాంతంగా వెయ్యి కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం కేరళలో 1,147 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 424 కేసులు, ఢిల్లీలో 294 కేసులు, గుజరాత్‌లో 223 కేసులు, కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి. కేరళలోనే ఎక్కువు ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటాలో పేర్కొంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా కరోనా.. మే 25 నుంచి బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని తెలిపింది. వారంలోనే 5 రెట్లు పెరిగిపోయాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై స్పందించిన అగ్నిమాపక శాఖ
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏడు మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో రెండు మరణాలు సంభవించగా.. గుజరాత్, కర్ణాటక, పంజాబ్ మరియు తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి. ఇక ఢిల్లీలో తాజాగా కోవిడ్‌తో ఇద్దరు చనిపోయారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన సంఖ్య ఢిల్లీలో 3కు చేరింది. పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 71 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో ఎక్కువగా పరీక్షలు నిర్వహించడం వల్లే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉన్నాయని.. కొన్ని లక్షణాల్లో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట ఉన్నాయని చెప్పింది. ఇక కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆసుపత్రులకు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, పరీక్షా కిట్లు మరియు వ్యాక్సిన్ల లభ్యతను కొనసాగించాలని ఆదేశించింది. వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాలని సూచించింది.