Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 08 06 2025

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :June 8, 2025 , 5:14 pm
By Gogikar Sai Krishna
  • ముగిసిన మాజీ మంత్రి పోలీస్ కస్టడీ.. జైలుకు తరలింపు..!?
  • వర్కింగ్‌ వీసా పేరుతో మహిళలకు బురిడీ.. చివరికి..!
  • అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!
  • దేశంలో 6000 మార్కును దాటిన కరోనా కేసులు..
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌!

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ‘సెలూన్ కొనికి’ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. సెలూన్ కొనికి ప్రారంభోత్సవం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అభిమానులకు హాయ్ చెప్పారు. కారు ఎక్కుతున్న సమయంలో అభిమానులకు హాయ్ చెప్పి.. నమస్కరించారు. దాంతో ఫాన్స్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ అంటూ అరిచారు. కొందరు ఫొటోస్, వీడియోస్ తీసుకున్నారు. అయితే సెలూన్ ప్రారంభోత్సవంకు పవన్ చాలా సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకుని వచ్చారు. ఇందుకు సంబందించిన పిక్స్ఎం వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యన ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమా షూటింగ్‌తో పవన్ బిజీగా ఉంటున్నారు.

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. ఆ జిల్లాలో కర్ఫ్యూ..

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శనివారం అనేక జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించారు. శనివారం రాత్రి మెయిటీ సంస్థ నాయకుడు అరంబై టెంగోల్, అనేక మంది ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హింస చెలరేగింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిలో చాలా మంది నిరసనకారులు నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అరంబాయి టెంగోల్ అరెస్టు తర్వాత.. శనివారం రాత్రి ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కూడా భారీ నిరసనలు చెలరేగాయి. రాజధాని ఇంఫాల్‌లోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇంఫాల్‌లోని ఖురాయ్ లామ్‌లాంగ్ ప్రాంతంలో, కోపంతో ఉన్న నిరసనకారులు బస్సులను తగలబెట్టారు. టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. నిరసనకారులు ఇక్కడితో ఆగలేదు. ఇంఫాల్ విమానాశ్రయంలోని తులిహాల్ గేటు వెలుపల గుమిగూడారు. ఆందోళనకారులు రాత్రిపూట విమానాశ్రయ రోడ్డులో ట్రాఫిక్‌ను అడ్డుకుని, రాత్రంతా అక్కడే నిద్రపోయారు.రాజధానిలో పెరుగుతున్న హింసను చూసి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్‌లో బహుమతి దక్కుతుంది..

పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో సమావేశమైంది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తించి, నిర్మూలించడానికి అమెరికాకు సహాయం చేసిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రిది పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును థరూర్ విమర్శించారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్‌మెన్ సోషల్ మీడియాకు ప్రతిస్పందనంగా థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ అఫ్రిది విడుదల కోసం ఒత్తిడి తీసుకురావాలని అమెరికాలో ఉన్న పాకిస్తాన్ డెలిగేషన్‌ని షెర్‌మెన్ కోరారు.

చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

దేశంలో 6000 మార్కును దాటిన కరోనా కేసులు..

భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133. కేరళ అత్యంత ప్రభావితం రాష్ట్రంగా కొనసాగుతోందని, ఆ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, మందుల లభ్యతను నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!

అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. అమరావతి సాధన పోరాటంలో 270 మంది చనిపోయారు. ఇప్పుడు పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? అని ఆమె ప్రశ్నించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని అభద్రంగా చెప్పే వారిని ప్రోత్సహించిన వారెవరో బయట పెట్టాలని ఆమె స్పష్టం చేశారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన మీటింగ్‌లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడారని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే మహిళలను కించపరచడమా? అని అనిత ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పేరు దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించారు, అందుకే ఆయనకు కోపం..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు. ‘‘రాహుల్ గాంధీ నిరంతరం ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానిస్తున్నారు. ఆయన ప్రజాతీర్పును పదే పదే అగౌరపరుస్తున్నారు. ప్రజలు రాహుల్ గాంధీని తిరస్కరించారు. ప్రతీకారంగా ఆయన ప్రజల్ని తిరస్కరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని మరింత క్షీణతలోకి నెట్టివేస్తుంది’’ అని ఫడ్నవీస్ అన్నారు. దీనికి ముందు, శనివారం రోజు రాహుల్ గాంధీ ఒక వార్తా పత్రిక కథనంలో.. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘‘ప్రజాస్వామ్యాన్ని మోసగించడానికి ఒక ప్రణాళిక’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ‘‘మ్యాక్ ఫిక్సింగ్’’ జరిగినట్లు బీహార్ లో కూడా చేస్తారని ఆయన ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ వాదనల్ని ‘పూర్తిగా అసంబద్ధం’’ అని కేంద్రం ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

వర్కింగ్‌ వీసా పేరుతో మహిళలకు బురిడీ.. చివరికి..!

అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు బదులు విసిటింగ్ వీసాపై వెళుతున్నట్లు తేలింది. దీంతో.. ఇద్దరు బాధితులను ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించడంతో సత్యనారాయణ చేతిలో మేరీ కొండలమ్మ మోసపోయినట్లు తేలింది. సత్యనారాయణ పై చీటింగ్, అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ముగిసిన మాజీ మంత్రి పోలీస్ కస్టడీ.. జైలుకు తరలింపు..!?

అక్రమ మైనింగ్ కేసులో మరింత విచారణకు సంబంధించి మూడు రోజులపాటు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిమీ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చిన మూడు రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. ఈ కస్టడీ కాలవ్యవధిలో రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారుల సమక్షంలో ఆయనను విచారించారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం కాకాణిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నారు.

గుడిలో జడ్జి మంగళసూత్రం దొంగతనం.. 10 మంది మహిళా దొంగల అరెస్టు..!

ఉత్తరప్రదేశ్‌ మథురాలోని ఆలయాలలో దొంగతనాలు చేసే మహిళల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇందుకు కారణం ఓ మహిళా జడ్జి మంగళసూత్రం దొంగతనానికి గురి కావడమే. జడ్జికి చెందిన మంగళసూత్రం అపహరించబడటంతో ఘటనపై లోతైన విచారణ జరిపారు పోలీసులు. ఈ నేపథ్యంలో మొత్తం 10 మంది మహిళా దొంగలు అరెస్టు చేయబడ్డారని అధికారులు తెలిపారు. ఇక అసలు విషయం ఏంటంటే.. జూన్ 1న మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన అదనపు జిల్లా అండ్ సెషన్స్ న్యాయమూర్తి ప్రేమా సాహు తన కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధావనలోని ఠాకూర్ శ్రీ రాధారమణ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వచ్చారు. అక్కడే ఆమె బంగారు మంగళసూత్రం దొంగతనానికి గురైంది. ఈ ఘటనపై ఆ జడ్జి పోలీసులకు విషయాన్నీ తెలిపారు. దీనితో ఈ ఘటనపై స్పందించిన మథురా జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) శ్లోక్ కుమార్ మాట్లాడుతూ.. వృద్ధావన్ ప్రాంతంలోని ఆలయాల్లో చురుకుగా దొంగతనానికి పాల్పడుతున్న మహిళా దొంగలను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించామని.. ఇందులో భాగంగా తాజాగా 10 మంది మహిళా దొంగలను అరెస్ట్ చేశామని తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona
  • kakani govardhan reddy
  • pawan kalyan
  • rahul gandhi
  • telugu news

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Hyderabad: మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్

  • Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

  • Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు..

  • Astrology: జూన్‌ 14, శనివారం దినఫలాలు

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions