సింగపూర్‌లో విధ్వంసం సృష్టించిన కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు.. ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది.
కొవిడ్ KP.2, KP.1 వేరియంట్ల కేసులతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. మ్యుటేషన్లు వేగంగా జరుగుతూనే ఉంటాయని.. ఇవి SARS-CoV-2కి దారి తీస్తుందని పేర్కొన్నారు. ” INSACOG నిఘా సున్నితమైనదని మరియు ఏదైనా కొత్త వేరియంట్‌ల ఆవిర్భావాన్ని పట్టుకోగలదని, వైరస్ కారణంగా వ్యాధి తీవ్రతలో ఏదైనా మార్పును గుర్తించడానికి నిర్మాణాత్మక పద్ధతిలో ఆసుపత్రుల నుండి నమూనాలను కూడా తీసుకుంటారని మూలం తెలిపింది.
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు
ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) సంకలనం చేసిన డేటా ప్రకారం.. KP.1 వేరియంట్ 34 కేసులు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కనుగొన్నారు. వీటిలో 23 కేసులు పశ్చిమ బెంగాల్ లో గుర్తించారు. గోవా (1), గుజరాత్ (2), హర్యానా (1), మహారాష్ట్ర (4) రాజస్థాన్ (2), ఉత్తరాఖండ్ (1) కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. KP.2 కేసులు 290 నమోదయ్యాయి. వాటిలో గరిష్టంగా 148 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఢిల్లీ (1), గోవా (12), గుజరాత్ (23), హర్యానా (3), కర్ణాటక (4), మధ్యప్రదేశ్ (1), ఒడిశా (17), రాజస్థాన్ (21), ఉత్తరప్రదేశ్ ( 8), ఉత్తరాఖండ్ (16), పశ్చిమ బెంగాల్ (36) కేసులు నమోదయ్యాయి.
మరోవైపు.. సింగపూర్ లో కోవిడ్ కొత్త వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. మే 5 నుండి 11 వరకు అక్కడ 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో కెపి.1, కెపి.2 కేసులు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. KP.1, KP.2 సబ్ వేరియంట్లు కోవిడ్-19 వేరియంట్‌ల సమూహానికి చెందినవి. వాటి ఉత్పరివర్తనాల సాంకేతిక పేర్ల ఆధారంగా శాస్త్రవేత్తలు వాటికి ‘FLiRT’ అని పేరు పెట్టారు.