SC Classification: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి.
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
మహా కుంభమేళాపై పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశమివ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుంభమేళాపై విపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని.. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ప్రియాంక కోరారు.
ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడం బాధాకరం అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజ్యసభలో సోనియా మాట్లాడారు.
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది.
KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం..
Minister Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అపరిచితుడు సినిమాలో మాదిరిగా టీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తోంది.. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. 15 నెలలు పూర్తి చేసుకున్నాం.. మొదటి ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం.. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.. 150 కోట్ల ట్రిప్పులు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు.
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.