Karnataka: పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయ శాఖ నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించింది. 2022లో జరిగిన ‘‘హుబ్బళ్లీ అల్లర్ల’’కు సంబంధించిన కేసును ఉపసంహరించుకుంది. ఈ కేసు ఉపసంహరణ ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని పోలీసులు, న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు అధికారిక పత్రాలు సూచించాయి. ఓల్డ్ హుబ్బళ్లీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో అల్లర్ల సమయంలో స్టేషన్ని ధ్వంసం చేశారు. నిందితుల్లో ఒకరైన ఎంఐఎం కార్పొరేటర్, నిరసన కోసం జనాన్ని…
కర్ణాటక అసెంబ్లీలో ఓ సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వింత ప్రతిపాదన తీసుకొచ్చారు. పురుషులకు వారానికి రెండు బాటిళ్ల ఉచిత మద్యం ఇవ్వాలని జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.36,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దీనిని వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీని కోసం మళ్ళీ పన్నులు పెంచాల్సి ఉంటుంది.…
Congress: వరస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత పునరుద్ధరణకు పార్టీలో రంగం సిద్ధమవుతుంది.
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది.
MLA Kunamneni: బడ్జెట్ కి సంబందించి అనేక ఆశలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ, ఆ ఆశలు తీరే విందంగా లేదు.. కేవలం కేంద్రం సపోర్టు లేకుండా.. అప్పులపై బడ్జెట్ నెరవేరడం కష్టం.. అలా తీరాలంటే మంత్రదండం కావాల్సి ఉంటుంది.
దేశంలో ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిగతులపై ఏడీఆర్ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలో అత్యంత ధనవంతుడైన బీజేపీ ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్లు ఉన్నాయని.. అత్యంత పేద బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు కేవలం రూ.1,700లే అని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ విశ్లేషణ చేసి నివేదిక విడుదల చేసింది.
Alleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు.
MLC Kavitha: తెలంగాణ బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతు.. “రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదురు చూశారు.. కానీ ఆరు గ్యరెంటీలు గోవిందా అని అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో బడ్జెట్…
డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మహిళకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు.