Bhatti Vikramarka: తెలంగాణ బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం కానున్నారు. ఈరోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అవనున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగంతో…
Telangana Budget: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి సుమారు 3. 20 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Cabinet Meeting: నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు.
దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 - 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ రేపు (మార్చ్ 19న) అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం కానుంది. గురువారం నాడు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్‌సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత,
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు.