CM Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశాం.. ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు క్యాబినెట్లో తీర్మానం చేశాం.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు.
Payal Shankar: జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన అని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. పూలే వారసులం అయిన బీసీలకు చదువులు దక్కడం లేదు.. తాము కరిగిపోతూ సమాజానికి సేవ చేస్తున్నాం.. అవకాశాలు మాత్రం బీసీలకు రావడం లేదు.. గత పాలకులు 7లక్షల కోట్ల అప్పులు చేశారు.
అవినీతి రారాజు కడియం శ్రీహరి కరెప్షన్ గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కడియం శ్రీహరి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు.. నేను ఎగురుతా, దుకుతా, పాడుతా నీకేంటి అని ప్రశ్నించారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరుగలేదనడం హాస్యాస్పదం.. కళ్ళు లేని కబోది కడియం... అది నోరా మున్సిపాలిటీ మొరా అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై ఎవరి వద్ద అయినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు, కేసీఆర్ నువ్వే రా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2023లో ప్రజలు కాంగ్రెస్…
BJP MLA: కేదార్నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్‌ను పరిశీలించనున్నారు.