Haryana: కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్తక్తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్జిత్ యాదవ మానేసర్ని గెలుచుకున్నారు.
హర్యానాలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్కు ఎన్నికలు జరిగాయి.
KTR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక…
Off The Record: కాబోయే ఎమ్మెల్సీ విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక అంతకు మించి అంటారా? ఎలాగూ నాది అధిష్టానం కోటా కదా.. ఇంకో అడుగు ముందుకేస్తే పోయేదేముందని ఆమె అనుకుంటే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ దక్కించుకున్న ఊపులో కేబినెట్ బెర్త్ మీద కూడా కర్చీఫ్ వేసే అవకాశం ఉందా? ఆ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?.
Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్లో పాపులర్ అవుతున్న క్వశ్చన్స్. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు అడగడంపై పంజాబ్లో రాజకీయ దుమారం రేపుతోంది. మార్చి 4 నుంచి పంజాబ్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పలు ప్రశ్నలు వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
MLC Nominations: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి…
నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.