Off The Record: జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ఛార్జ్? పాలకొండలో కూటమి కుమ్ములాటలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ కూటమిలో అంటుకున్న మంటలు ఎగిసిపడుతున్నాయా? మొత్తం పొలిటికల్ సిట్యుయేషన్‌నే మార్చి వేస్తున్నాయా? జనసేన ఎమ్మెల్యే కోసం టీడీపీ కేడరే నిలువునా చీలిపోయిందా? శాసనసభ్యుడికి కూడా సొంత పార్టీకంటే… తెలుగుదేశం కేడరే ముద్దొస్తున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? తమ్ముళ్ళకు పెరుగుతున్న తలనొప్పులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: Off The Record : బెజవాడ ఎంపీ సీట్లో ఈసారి గేమ్ మార్చబోతున్న వైసీపీ?
Also Read
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం కూటమిలో కుమ్ములాటలు ఓ రేంజ్‌కు చేరుకుంటున్నాయి. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నట్టు మారిపోతోంది రాజకీయం. ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్‌వార్ క్రమంగా బయటపడుతూ… మొత్తంగా ఇక్కడ కూటమి ఉనికినే ప్రశ్నించే పరిస్థితికు చేరుకుంటోందని అంటున్నారు ఈ పరిణామాలను గమనిస్తున్నవాళ్ళు. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఈ రిజర్వుడు సెగ్మెంట్ మీద ఆధిపత్యం కోసం ఇద్దరూ వేస్తున్న ఎత్తుగడలతో రెండు పార్టీల కేడర్‌లో కూడా గందరగోళం పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మేం నలిగిపోతున్నామన్నది వాళ్ళ మాట. భూదేవి, జయకృష్ణ ఇద్దరూ అంతకుముందు టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో జయకృష్ణ జనసేన నుంచి పోటీ చేసినా….. ఆయనకు తెలుగుదేశం కేడరే గట్టిగా సపోర్ట్ చేసిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. గ్రామ స్థాయిలోని టీడీపీ కార్యకర్తలతో ఉన్న సత్సంబంధాలే ఎమ్మెల్యే గెలుపునకు ప్రధాన కారణం అంటారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. అలాంటి చోట గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలవడానికి ప్రధాన కారణం సుదీర్ఘ కాలంపాటు టిడిపితో ఆయనకున్న విడదీయరాని అనుబంధమే కారణమట. ఇప్పుడు కూడా…. నిమ్మక జయకృష్ణ పేరుకే జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ… ఆయన వెంట తిరిగే క్యాడర్ అంతా తెలుగుదేశం నేతలేనట.
READ MORE: Ayesha Meera Murder Case: సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం.. ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్..
ఇక గత ఎన్నికల్లో పాలకొండ టికెట్ ఆశించి భంగపడ్డ పడాల భూదేవిని టిడిపి అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా నియమించింది. ఇక అప్పటి నుంచి గ్రూప్‌వార్ తగ్గేదే లే అన్నట్టుగా పెరిగిపోతోంది. ఎమ్మెల్యే జయకృష్ణ నియోజకవర్గంలో తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తూనే టీడీపీ కేడర్‌లో కూడా తన పట్టు తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకు తగ్గట్టే…. జయకృష్ణ వెంట నడుస్తున్న టీడీపీ వర్గం… పార్టీ ఇన్ఛార్జ్ భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అలాగే భూదేవి వర్గం కూడా…ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో ఇటీవల టిడిపి సభ్యత్వ కార్డుల పంపిణీలో తమ్ముళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే….మార్కెట్ కమిటీ పదవుల వ్యవహారం లోకల్ పాలిటిక్స్‌లో మరింత వేడి రాజేసింది. యేళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేసిన వారిని కాదని ఇంఛార్జ్ తనకు నచ్చిన వాళ్ళనే మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించారంటూ ఆరోపిస్తోంది టిడిపిలోని మరో వర్గం. ఇలాంటి పరిస్ధితుల్లో పాలకొండలో ఈ నేతలిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా లేవంటున్నారు కూటమి కార్యకర్తలు. పై స్థాయిలో కూటమి ముఖ్య నేతలంతా….పూర్తి అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. గ్యాప్ రాకూడదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. కానీ…. పాలకొండలో మాత్రం నియోజకవర్గ నాయకులు అవన్నీ మాకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే ఉంటే… ఇది ప్రత్యర్థులకు కచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగాల్సిందేనని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!