Delimitation : డీలిమిటేషన్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రేవంత్ రెడ్డి..
- పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభ
- జాతీయ స్థాయిలో సమన్వయం..కార్యాచరణ అమలుకు ఢిల్లీలో కార్యాలయం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు సదస్సులో ఆమోదం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation : నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్‌లో వేదిక కానుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో పునర్విభజన సదస్సు, సభకు హైదరాబాద్ వేదికగా మారనుంది. పునర్విభజనపై దక్షిణాదితో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల గళాన్ని బలంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే అన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్కడ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ..పరస్పరం సమన్వయం చేసుకుంటూ.. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎంపీలతో కూడిన కమిటీ పని చేయాలని, ఇందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రులు, నాయకులు అంగీకరించడంతో ఢిల్లీలో ఆ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చరిత్ర.. వర్తమాన పరిస్థితులతో పాటు జనాభా దామాషా, ప్రొరేట్ ప్రకారం పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా నష్టపోయే తీరును సీఎం రేవంత్ రెడ్డి వివరించడంతో సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శ్రద్దగా విన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినా లోక్‌సభ సీట్లు పెంచకుండా శాసనసభ సీట్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని సీఎం సూచించడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మహిళలకు 33 శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలు చాలా అర్ధవంతంగా ఉన్నాయని సదస్సులో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.
Also Read
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్లో మృతదేహం..
Cricket Legends: నాతో సెల్ఫీ కావాలా? ఆటోగ్రాఫ్ కావాలా?.. కపిల్, ధోనికి రోహిత్ ఫన్నీ ఆఫర్..
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..