Rava Kesari Recipe: గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ ఇంట్లోనే.. స్పెషల్ రవ్వ కేసరి చేసే సీక్రెట్ టిప్ ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rava Kesari Recipe: చాలామందికి గుడిలో పెట్టె వివిధ ప్రసాదాలంటే ఎంతో ఇష్టంగా తినడం చూస్తుంటాము. అందులో పులిహోర, దద్దోజనం, పొంగలి, కేసరి వంటి చూస్తూనే ఉంటాము. అయితే ఇవి మన ఇళ్లలో తయారు చేస్తే ఆయా రుచి రాదు. ఇక రవ్వ కేసరి విషయానికి వస్తే.. ఇంట్లో చేస్తే కొద్దిసేపటికే గట్టిపడిపోవడం, తయారుచేసేటప్పుడు ఉండలు కట్టడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే సరైన కొలతలు, కొన్ని సీక్రెట్ టిప్స్ పాటిస్తే గుడిలో పెట్టే ప్రసాదంలా నోట్లో జారిపోయే విధంగా, రోజంతా మృదువుగా ఉండే రవ్వ కేసరిని చాలా సులువుగా తయారు చేయవచ్చు.
ఈ రెసిపీకి ముఖ్యమైన విషయం కొలత. ఇంట్లో ఉన్న ఏదైనా ఒకే సైజ్ బౌల్‌ను కొలతగా తీసుకుని, అన్ని పదార్థాలను అదే బౌల్‌తో కొలవాలి. ఒక కప్పు ఫైన్ సూజీ రవ్వ తీసుకోవాలి. చిరోటి సూజీ అయితే ఇంకా బెటర్. లేకపోతే నార్మల్ రవ్వతో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!
నీటి పరిమాణం:
ఒక కప్పు రవ్వకు మూడున్నర కప్పుల నీళ్లు అవసరం. నీళ్లు మరిగించే సమయంలో చిటికెడు కుంకుమపువ్వు నలిపి వేస్తే కేసరికి సహజమైన రంగు, మంచి సువాసన వస్తుంది. కావాలంటే ఎల్లో లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్‌గా కూడా చేయొచ్చు.
నూనె & నెయ్యి మిశ్రమం:
రవ్వ కేసరి గట్టిపడకుండా ఉండాలంటే నూనె–నెయ్యి మిశ్రమం చాలా కీలకం. రవ్వ తీసుకున్న అదే కప్పుతో మూడో వంతు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుని, అలాగే మూడో వంతు కప్పు కరిగించిన నెయ్యి కలపాలి. ఇష్టమైతే దీన్ని ఒక కప్పు వరకు పెంచుకోవచ్చు. నూనెతో పాటు నెయ్యి కలిపి వాడటం వల్ల కేసరి రోజంతా మెత్తగా ఉంటుంది.
రవ్వను ఎలా వేయించాలి?
స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఒక కప్పు రవ్వ వేసి మీడియం ఫ్లేమ్‌లో నిరంతరం కలుపుతూ బాగా దోరగా వేయించాలి. రవ్వ తెలుపు రంగు నుంచి లైట్ బ్రౌన్ షేడ్‌కు మారితే పర్ఫెక్ట్‌గా వేయించినట్టే.
నీళ్లు వేసే సరైన స్టేజ్:
రవ్వ వేగిన తర్వాత మరిగించిన కుంకుమ నీటిని ఒక్కసారిగా వేసి, మంట సిమ్‌లో పెట్టి బాగా కలపాలి. రెండు నిమిషాల్లోనే రవ్వ నీళ్లు పీల్చుకుని దగ్గర పడుతుంది. ఈ దశలోనే సరైన టెక్స్చర్ రావడం చాలా ముఖ్యం.
BJP Leader: మమతా బెనర్జీ మంత్రగత్తె, ఆమె తల నరకాలి.. వివాదంగా బీజేపీ నేత వ్యాఖ్యలు..
పంచదార & ఫ్లేవర్ అడిషన్స్:
ఇప్పుడు అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పుల పంచదార వేయాలి. పంచదార వేసిన తర్వాత మిశ్రమం కొంచెం పలచన అవుతుంది. ఇది మామూలుగానే జరుగుతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేయాలి. పచ్చ కర్పూరం వల్ల గుడి ప్రసాదంలా ప్రత్యేకమైన సువాసన వస్తుంది.
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ:
చివరిగా మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలిపి, సిమ్‌లో ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే నోట్లో వెన్నలా జారిపోయే రవ్వ కేసరి రెడీ.
చల్లారిన తర్వాత కూడా మెత్తగానే:
రవ్వ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మృదువుగా, గట్టిపడకుండా ఉండటం ఈ రెసిపీ స్పెషాలిటీ. ఈ పక్కా కొలతలు, టిప్స్ పాటిస్తే ఇంట్లో ప్రసాదానికి అయినా, గుడిలో పంచడానికి అయినా పెద్ద మొత్తంలో రవ్వ కేసరి చేయడం చాలా సులభం అవుతుంది.
తాజావార్తలు
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!